హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేవల్లి పాఠశాలల్లో డీఈఓ యాదయ్య తనిఖీ

WNP: రేవల్లి మండలంలోని కేజీబీవీ, జెడ్పీహెచ్‌ఎస్, పీఎం శ్రీ ప్రాథమిక పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య ఇవాళ సందర్శించారు. విద్యార్థుల హాజరు, బోధన, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యా ప్రమాణాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.