హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విదేశీ పక్షుల వేటగాళ్ల అరెస్ట్

కోనసీమ: మామిడికుదురు మండలం బి.దొడ్డవరం పరిధిలోని మధ్యలంకలో విదేశీ పక్షులను వేటాడుతున్న ఇద్దరిని అటవీశాఖ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. స్థానికుడు కుడిపూడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఫారెస్ట్ రేంజ్ అధికారి సత్యనారాయణ సిబ్బందితో నిందితులను పట్టుకున్నారు. విదేశీ పక్షులను వేటాడితే ఉపేక్షించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.