హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్యవైశ్యుల స్థలంపై కబ్జా యత్నం

అన్నమయ్య: మదనపల్లె ఆర్యవైశ్యులకు చెందిన స్థలంలోకి కొందరు వ్యక్తులు చొరబడి గేట్లు ధ్వంసం చేసి, సెల్‌ఫోన్లు లాక్కొని దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. తమ స్థలం సర్వే నంబర్‌ 303/1 కాగా, కబ్జాదారులు 303/2గా పేర్కొంటున్నారని తెలిపారు. జేసీబీ, ట్రాక్టర్లతో వచ్చి బెదిరించారని, పక్కా పత్రాలతో చట్టపరంగా పోరాడతామని స్పష్టం చేశారు.