హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చెరువు నిర్వాసితుల దీక్షలు కొనసాగింపు'

WNP: గోపాలపేట మండలం బుద్ధారం గ్రామంలో పెద్ద చెరువు భూ నిర్వాసితుల ఆధ్వర్యంలో మూడో రోజు రైతుల దీక్షలు కొనసాగాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు దీక్షలకు మద్దతు తెలిపి, 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ. 47.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే దశలవారీ పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.