BPT: కొరిశపాడు మండలం తిమ్మనపాలెంలో గురువారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను అద్దంకి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన VB-G RAMG పథకం ఉద్యోగులు కలిశారు. 20 ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న తమ వేతనాలు పెరగడం లేదని, నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వేతనాలు పెంచాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
వేతనాలు పెంచాలని మంత్రి గొట్టిపాటికి వినతి


