హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులి కోసం ముమ్మరంగా సాగుతున్న సెర్చ్ ఆపరేషన్

EG: దేవరపల్లి మండలం గౌరీపట్నం ప్రాంతంలో పెద్దపులి సంచారంతో అటవీశాఖ అధికారులు గురువారం విస్తృతంగా గాలింపు చేపట్టారు. పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసి, డ్రోన్ కెమెరాలతో పరిసరాలను పరిశీలిస్తున్నారు. పులిని త్వరలోనే బంధిస్తామని అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.