హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యం'

NTR: నందిగామ డీవీఆర్ ఏరియా హాస్పిటల్‌లో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత స్వచ్ఛందంగా రక్తదానంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ హాస్పిటల్ అవార్డు పొందిన ఆసుపత్రి సిబ్బందిని అభినందించారు.