AKP: నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో గురువారం పాయకరావుపేటలో సంతకాల సేకరణ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల సంతకాల సేకరణలో భాగంగా ఐద్వా ప్రతినిధులు స్థానిక కాంప్లెక్స్ వద్ద ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. బియ్యం, నూనె, కూరగాయలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ధరలు తగ్గించాలని సంతకాల సేకరణ


