ELR: తల్లులు, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటేనే సంపూర్ణ సమాజ అభివృద్ధి సాధ్యమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. కామవరపుకోట కల్యాణ మండపంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం 9వ రాష్ట్రీయ పోషణ్ మాసం, 'సేవా సంకల్పం' కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పౌష్టికాహార, చిరుధాన్యాల స్టాల్స్‌ను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం: ఎమ్మెల్యే


