హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారికి బంగారు పగడాల హారాల కానుక

TPT: తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు కమల గురువారం విలువైన ఆభరణాలను సమర్పించారు. సుమారు రూ. 25 లక్షల విలువైన రెండు బంగారు పగడాల హారాలను కుటుంబ సభ్యులతో కలిసి రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. శ్రీవారి సేవలో భాగంగా ఆభరణాలను విరాళంగా సమర్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.