TPT: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని డీఈవో KVN. కుమార్ సూచించారు. గురువారం పాతవీరాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ ప్రైమరీ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల అభ్యసనా స్థాయిని పరిశీలించారు.10వ తరగతిలో 100 శాతం ఫలితాల సాధనకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి'


