VSP: భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ ఎంవీపీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శొంఠ్యాం గ్రామానికి చెందిన సుమారు 200 మంది వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు


