తూ.గో: గోకవరంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ సందర్శించారు. పుస్తకాలు, పాఠకులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. గ్రంథాలయానికి మరిన్ని పుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్, మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్థులు కోరారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకొని అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఛైర్మన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
లైబ్రరీలో మౌలిక సదుపాయాలపై జిల్లా ఛైర్మన్ కీలక హామీ


