హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామంలో కాకుండా ప్రైవేట్ షాప్ వెనుక బోర్వెల్

ASR: పాడేరు మండలం బొక్కెల్లు గ్రామానికి 15వ ఆర్థిక సంఘం నిధులతో మంజూరైన తాగునీటి బోర్వెల్‌ను గ్రామంలో కాకుండా ప్రైవేట్ షాప్ వెనుక తవ్వించారని గ్రామస్తులు ఇవాళ ఆరోపించారు. గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండానే తీర్మానాలు చేశారన్నారు. తీర్మానంలో ఉన్న వ్యక్తి గ్రామానికి చెందినవారు కాదన్నారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.