TPT: తిరుపతి కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో శక్తి బృందం ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ నేరాలు, ప్రేమ వ్యవహారాలు, ఒత్తిడి తదితర అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ లక్ష్యసాధన దిశగా సాగాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు శక్తి బృందం అవగాహన


