హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పవన్‌ కల్యాణ్‌ పేరిట ఫేక్ అకౌంట్.. వ్యక్తి అరెస్ట్

GNTR: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతా తెరిచి, మంత్రి నారా లోకేష్‌పై అసత్య ప్రచారం చేస్తున్న గుంటూరు జిల్లా ఎర్రబాలెంకు చెందిన వెంకట దుర్గ రాకేశ్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు టీడీపీ-జనసేన మధ్య చిచ్చుపెట్టేలా కల్పిత పోస్టులు సృష్టిస్తున్నాడని, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.