హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుత్తిలో విషాదం.. రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

అనంతపురం: గుత్తి పట్టణములోని ఎమ్మెస్ జూనియర్ కళాశాల సమీపంలో రైలు కిందపడి మొహమ్మద్ అల్తాఫ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.