హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజారోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యం'

VZM: ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎల్.కోట PHCలో వైద్యాధికారి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి మంజూరైన 1.5 లక్షల నిధులు ఖర్చు చేసేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.