హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగనన్న కాలనీలో ఎమ్మెల్యే పర్యటన

 కృష్ణా: పమిడిముక్కల మండలం మంటాడ జగనన్న కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. కాలనీవాసులతో మాట్లాడి తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, జంగిల్ క్లియరెన్స్ సమస్యలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సమస్యలు పరిష్కారం కాలేదని స్థానికులు తెలిపారు. అధికారులతో చర్చించి త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.