హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తిలో 2వ రోజూ కొనసాగిన స్టాఫ్ నర్సుల నిరసన

సత్యసాయి: సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో స్టాఫ్ నర్సుల ఆందోళన గురువారం 2వ రోజుకు చేరింది. ఏళ్లుగా సేవలు అందిస్తున్న తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ విధానం వల్ల పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెస్తూ, తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆవేదన వ్యక్తం చేశారు.