హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ఎస్పీని కలిసిన నూతన DSP

అనకాపల్లి సబ్ డీఎస్పీగా నరసింహారావు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. స్థానిక ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, విజిబుల్ పోలీసింగ్, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. గతంలో ఇక్కడే సీఐగా పనిచేసిన అనుభవంతో నేర నియంత్రణకు, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.