హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పౌష్టికాహారంతోనే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం'

SKLM: పౌష్టికాహారంతోనే చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పాతపట్నం మండలం తెంబూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ హోమియోవైద్యశాల వైద్యాధికారి డాక్టర్ ఎస్.ఉమాగౌరి అన్నారు. ఇవాళ స్థానిక అంగన్వాడి కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చిన్నారుల తల్లులకు పోషణ వైద్యం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత సీజన్‌లో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.