హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ-పంట నమోదుపై జాయింట్ కలెక్టర్ 'సూపర్ చెక్'

ATP: రాప్తాడు మండలంలో ఖరీఫ్ 2026 ఈ-పంట వివరాలను జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాప్తాడు గ్రామంలోని పలు సర్వే నంబర్లలో సాగు చేసిన చీనీ తోటలను జేసీ స్వయంగా వీక్షించి, పంటల వివరాలపై రైతులతో మాట్లాడారు. ఈ పరిశీలన కార్యక్రమంలో తహసీల్దార్ చెన్నకేశవులు, వ్యవసాయ అధికారులు, వీఆర్వోలు, వీఏఓలు పాల్గొన్నారు.