హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థినుల భద్రతకు ‘శక్తి’ యాప్‌ అండ

NDL: నందికొట్కూరులో విద్యార్థినుల భద్రతపై శక్తి టీం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. శక్తి యాప్ ద్వారా మహిళలు, బాలికలు ఆపద సమయంలో పోలీసుల సహాయం పొందవచ్చని వివరించారు. సైబర్ మోసాలకు గురైతే 1930కు ఫిర్యాదు చేయాలని, మైనర్లు ద్విచక్ర వాహనాలు నడపరాదని సూచించారు. POCSO చట్టంపై అవగాహన కల్పిస్తూ ఆకర్షణలకు లోనుకాకుండా చదువుపై దృష్టి పెట్టాలని పోలీసులు సూచించారు.