హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ'

VSP: రాంనగర్‌లోని దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాల పోస్టర్‌ను దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఇవాళ ఆవిష్కరించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. అమ్మవారి ఆశీస్సులతో విశాఖ నగరం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.