BPT: బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం పోలూరు గ్రామంలోని ఆర్‌డబ్ల్యూఎస్ పథకంలో రూ. 8.25 లక్షల డీఎమ్‌ఎఫ్ నిధులతో ఫిల్టర్ మీడియాను మార్చారు. నీటి శుద్ధి సామర్థ్యం మెరుగుపడటంతో గ్రామంలోని 2,556 మంది ప్రజలకు నిరంతరం నాణ్యమైన, సురక్షితమైన తాగునీరు అందుతోంది. నీటి నాణ్యత సమస్యలు తీరి, మెరుగైన సరఫరా అందుబాటులోకి రావడంతో పోలూరు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోలూరులో సురక్షిత తాగునీటికి భరోసా!


