హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి అగ్రిగోల్డ్ బాధితుల ధ్రువపత్రాల పరిశీలన

నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో గురువారం నుంచి అగ్రిగోల్డ్ బాధితుల బాండ్లు, ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు CID ASP S. శిరీష తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. డిపాజిటర్లు ఒరిజినల్ బాండ్లు, ఆధార్, పాన్, బ్యాంకు పాస్‌బుక్, ఫొటో, మొబైల్ నంబర్ తదితర పత్రాలు తీసుకురావాలని సూచించారు.