BPT: చీరాల రూరల్ పరిధిలోని రామకృష్ణాపురం ప్రధాన రహదారి, విశాల్ మార్ట్ ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభం సగం విరిగి, ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది. రద్దీగా ఉండే ఈ మార్గంలో నిత్యం వాహనదారులు, పాదచారులు భయంతో ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, ఆ స్తంభాన్ని తొలగించి నూతన స్తంభాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం


