తూ.గో: రాజమండ్రి రూరల్ మండలం రాజవోలులో విద్యుత్ తీగలు తగిలి గురువారం ఇద్దరు మృతి చెందారు. చిన్న కృష్ణారెడ్డి (55), సూర్యారావు (50) CC కెమెరాలు బిగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
CC కెమెరాలు బిగిస్తుండగా షాక్.. ఇద్దరి మృతి!


