హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రంథాలయానికి కొత్త పుస్తకాలు అందజేత

NTR: కోనాయపాలెం ఉన్నత పాఠశాలలోని గ్రంథాలయానికి సహకార సంఘ ఛైర్మన్ వాసిరెడ్డి ప్రసాద్ పుస్తకాలను అందజేశారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో రూ.10వేల విలువ జేసే 300 పుస్తకాలను ప్రధానోపాధ్యాయులు డీవీఎల్ నారాయణకు అందజేశారు. పాఠశాల, విద్యాభివృద్ధికి వాసిరెడ్డి చేస్తున్న సేవలను ప్రధానోపాధ్యాయులు కొనియాడారు. కమిటీ ఛైర్మన్ ఉలవలపూడి ఏసుబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.