విశాఖలో 50 గ్రాముల MDMA, లీటర్ లిక్విడ్ గంజాయిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయించేందుకు గాజువాక నుంచి నగరంలోకి వచ్చిన ముగ్గురు నిందితులను ఈస్ట్ పాయింట్ కాలనీలో మాటువేసి పట్టుకున్నారు. నిందితులను త్రీటౌన్ పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్ వెనుక ఉన్న లింకులపై ఇవాళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో డ్రగ్స్ కలకలం


