హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిన్నిస్ రికార్డు సాధించిన లలితా రాణికి సన్మానం

SKLM: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన చల్లా లలితారాణిని మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ కోటబొమ్మాలి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఆగస్టు 15న ఊలుతో 12.18 కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాలను అల్లి రికార్డు సాధించినందుకు అభినందించారు. కార్యక్రమంలో ఏపీఎన్జీవో సంఘం నాయకులు, చల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.