ADB: జిల్లా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా గురువారం తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులు, వినతుల కోసం ప్రతిసారీ కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేకుండా, ఇంటి వద్ద నుంచే తమ సమస్యలను తెలుపవచ్చునని సూచించారు. తమ ఫిర్యాదులను 9492341947 నంబరుకు మెసేజ్ చేయాలని కోరారు.
తెలంగాణ
సమస్యల పరిష్కారానికి వాట్సాప్ గ్రీవెన్స్: కలెక్టర్


