హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతులకు రుణాలు రెన్యువల్ చేయాలి'

అన్నమయ్య: రైతులు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలకు వడ్డీ వసూలు చేసి రెన్యువల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం తంబళ్లపల్లి అధ్యక్షుడు కాళ సముద్రం హైదరవలీ డిమాండ్ చేశారు. ములకలచెరువు నల్లగుట్టలో ఆయన ప్రజలతో కలిసి నిరసన చేపట్టారు. ఎల్‌నినో ప్రభావంతో పంటలు సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.