హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోలీసు విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి'

శ్రీకాకుళం సబ్‌ డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. ఇటీవల శ్రీకాకుళం సబ్‌ డివిజన్ నూతన డీఎస్పీ‌గా బాధ్యతలు స్వీకరించిన ధనుంజయ నాయుడు ఇవాళ నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీసు విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అని సూచించారు.