హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తి డీఎస్పీగా మాణిక్యరావు బాధ్యతల స్వీకరణ

సత్యసాయి: పుట్టపర్తి డీఎస్పీగా మాణిక్యరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా డీఎస్పీ పేర్కొన్నారు. సకాలంలో న్యాయం అందిస్తూ బాధ్యతాయుతంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.