హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైకుంఠపురం గుడిలో అభివృద్ధి పనుల పరిశీలన

GNTR: తెనాలి వైకుంఠపురం దేవస్థానాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం ఉదయం సందర్శించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. దక్షిణం వైపు వంటశాల పక్కన ఉన్న పాత నిర్మాణాలను తొలగించి, వాటి స్థానంలో నూతన నిర్మాణాలు చేపట్టనున్నట్లు సమాచారం.