SRD: ఆన్‌లైన్ షాపింగ్, సోషల్ మీడియా నకిలీ లింకులు, డిస్కౌంట్ ఆఫర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిర్గాపూర్ ఎస్ఐ మహేష్ గురువారం సూచించారు. కేవలం నమ్మకమైన అధికారిక సైట్లలోనే కొనుగోళ్లు జరపాలని, అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని స్పష్టం చేశారు. ఒకవేళ మోసపోతే తక్షణమే 1930 లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.
తెలంగాణ
'ఆన్‌లైన్ షాపింగ్ మోసాలపై ఎస్సై కీలక సూచనలు'


