హైదరాబాద్: 28°C
తెలంగాణ

'​ఈ నెలలోనే సిర్గాపూర్‌లో వాలీబాల్ టోర్నమెంట్'

SRD:​ సిర్గాపూర్ ZPHS మైదానంలో అక్టోబర్ 13న ఓపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నమెంట్-2026 నిర్వహించనున్నట్లు యూత్ క్లబ్ గురువారం తెలిపింది. ప్రథమ విజేతకు ₹21,000 (స్పాన్సర్: సర్పంచ్ డి. శ్రీనివాస్ రావ్ పాటిల్), ద్వితీయ విజేతకు ₹11,000 (స్పాన్సర్: డి. కిరణ్ రావ్ పాటిల్) బహుమతిగా అందజేస్తారు. ఆసక్తిగల జట్లు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.