హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా బీజేపీ నేతకు కీలక బాధ్యతలు

WNP: బీజేపీ తెలంగాణ మహిళా మోర్చాలో చేపట్టిన తాజా నియామకాల్లో వనపర్తికి చెందిన అశ్విని రాధకు ‘మన్ కీ బాత్’ కో-కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పా రెడ్డి ఆధ్వర్యంలో నియామకాలు జరిగాయి. అశ్విని రాధకు రాష్ట్రస్థాయి బాధ్యత దక్కడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.