హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయవాదుల రక్షణ చట్టం కోసం నరసాపురంలో దీక్ష

WG: రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నరసాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ స్థానిక సెంటర్‌లో న్యాయవాదులు దీక్ష చేపట్టారు. విధి నిర్వహణలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రక్షణ సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని మాట్లాడారు. తమ భద్రత దృష్ట్యా వెంటనే కఠినమైన చట్టాన్ని తేవాలని వారు స్పష్టం చేశారు.