AKP: ఎలమంచిలి పట్టణ రామ్ నగర్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్ధంగా రాటవేశారు. ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. విజయవంతం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దసరా సందర్భంగా రాట మహోత్సవం


