కోనసీమ: అమలాపురంలోని సర్ సి.వి. రామన్ స్కూల్‌లో లయన్స్ క్లబ్ ఎగ్జిక్యూటివ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నారు. చిన్నారులతో పాటు అవసరమైన వారికి నేత్ర పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలను గుర్తించి వైద్య సూచనలు అందించనున్నారు. తల్లిదండ్రులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు అమలాపురంలో ఉచిత కంటి వైద్య శిబిరం


