VZM: విజయనగరం జిల్లా గంట్యాడ మండల కేంద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ కొటారుబిల్లి జంక్షన్ నుంచి చినమానాపురం గ్రామానికి వెళ్తున్న కారు హఠాత్తుగా అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న చినమానాపురం గ్రామానికి చెందిన యువకుడు పాసల రమాకాంత్ ఊపిరాడక మృతి చెందాడు. మృతదేహాన్ని కారులో నుంచి పోలీసులు బయటకు తీయించారు.
ఆంధ్రప్రదేశ్
చెరువులోకి దూసుకెళ్లిన కారు.. యువకుడు మృతి


