కాకినాడ: ఈ నెల 11 నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం కానుండటంతో కాకినాడ రూరల్ ప్రాంతాల్లో దుర్గమ్మ మండపాల ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. దీంతో సర్పవరంలో అమ్మవారి విగ్రహాల విక్రయ స్టాళ్లను భారీగా ఏర్పాటు చేశారు. విగ్రహాల ధరలు అధికంగా ఉన్నాయని భక్తులు అంటున్నారు. వినాయకుడి తరహాలో పెద్ద సైజులు పెట్టరని, అందుకే చిన్న సైజులే ఎక్కువగా తెచ్చామని వ్యాపారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దేవీ నవరాత్రులు.. మార్కెట్లో అమ్మ వారి విగ్రహాల సందడి


