ప్రకాశం: దొనకొండ టౌన్ VV పురంలో SI సి. రామకృష్ణ బుధవారం ఆకస్మిక కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద ఇళ్లు, వ్యక్తుల కదలికలు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల కోసం సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు SI తెలిపారు. యజమానులు ధ్రువపత్రాలను సమర్పించి వాహనాలను తీసుకువెళ్లవచ్చని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
దొనకొండలో కార్డాన్ సెర్చ్.. 20 వాహనాలు సీజ్!


