ATP: అనంతపురం జిల్లాలో SIR-2026 గణనలో 2,48,087 మంది ఓటర్లు ఇచ్చిన చిరునామాల్లో లేనట్లు అధికారులు గుర్తించారు. మరణం, శాశ్వత నివాస మార్పు, బహుళ నమోదులు, ఆచూకీ లేకపోవడం తదితర కారణాలతో వీరిని గుర్తించారు. అనంతరం 17,90,436 మంది ఓటర్లతో ముసాయిదా జాబితాను ప్రచురించినట్లు వెల్లడించారు. ఇక తుది ఓటర్ల జాబితాలను అక్టోబర్ 16న ప్రచురించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
2,48,087 మంది ఓటర్లు ఎక్కడ?


