హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒక్క మద్యం షాపు కోసం 33 మంది పోటీ!

ఏలూరు జిల్లాలో మద్యం దుకాణాల కోసం వ్యాపారులు భారీగా పోటీపడ్డారు. 19 దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 14 షాపుల కోసం 104 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.3.12 కోట్ల ఆదాయం సమకూరింది. భీమడోలులో ఓ షాపునకు 33 మంది, ముసునూరులో 17 మంది పోటీపడగా, ఐదు షాపులకు దరఖాస్తులు రాలేదు. గురువారం కలెక్టరేట్లో లాటరీ ద్వారా విజేతలను ఎంపిక చేయనున్నారు.