హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచ్‌ని సస్పెండ్ చేసిన కలెక్టర్

ADB: నార్నూర్ మండలం గుండాల (జి) సర్పంచ్ రాథోడ్ సురేశ్‌పై వేటు పడింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై అధికారులు విచారణ చేసి ఆరోపణలు నిజమేనని నిర్ధారించారు. దీంతో సర్పంచ్‌ని కలెక్టర్ రాజర్షి షా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.