హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గుంతల రోడ్డు.. ప్రయాణికుల తంటాలు!

ప్రకాశం: బేస్తవారిపేట నుంచి ఒంగోలుకు వెళ్లే మెయిన్ రోడ్ దాదాపు 50 కిలోమీటర్ల మేర గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. గుంతల కారణంగా వాహనాలు దెబ్బతింటుండగా, ప్రమాదాల భయం నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రయాణికులు కోరుతున్నారు.